- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు
by srinivas |
X
న్యూఢిల్లీ: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. కన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు గానూ సోమవారం ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్‌కు రావాలని కోరారు. గత బుధవారమే ఆమెను అధికారులు 8 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే. కన్మాన్ జాక్వెలిన్‌కు పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా ఈ సందర్భంగా విచారించారు. అయితే తొలి రౌండ్ విచారణలో ఢిల్లీ పోలీసుల ఆమె సరిగ్గా స్పందించలేదని గుర్తించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రూ.200 కోట్ల దోపిడీ, మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ జాక్వెలిన్‌కు భారీ బహుమతులు, ఖరీదైన బ్యాగులు ఇచ్చారని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇద్దరు కొన్ని నెలల పాటు రిలేషన్ కూడా కొనసాగించారు. ఇప్పటికే మరో హీరోయిన్ నోరా ఫతేహీని కూడా ఇదే కేసులో విచారించారు.
Advertisement
Next Story