- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మన ‘శివశక్తి’కి అంతర్జాతీయ గుర్తింపు.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా మన ఇస్రో పంపిన రోవర్ ‘ప్రజ్ఞాన్’ చంద్రుడిపై తిరిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మార్చి 19న ఈ పేరుకు అంతర్జాతీయ ఖగోళ సంఘం (ఐఏయూ) ఆమోదం తెలిపింది. చందమామపై రోవర్ ‘ప్రజ్ఞాన్’ సంచరించిన ప్రదేశాన్ని ‘శివశక్తి’ అని 2023 ఆగస్టు 26న బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) కేంద్రం వేదికగా ప్రధాని మోడీ పిలిచారు. ఈ ప్రకటన చేసిన దాదాపు ఏడు నెలల తర్వాత ‘శివశక్తి’ పేరు వినియోగానికి అంతర్జాతీయ ఖగోళ సంఘం నుంచి అధికారిక అనుమతి లభించింది. ఇక చంద్రయాన్-2 రోవర్ పాదముద్రలు కలిగిన చంద్రుడి ఉపరితల ప్రదేశానికి ‘తిరంగా’ అనే పేరును ప్రధాని మోడీ అప్పట్లో ప్రకటించారు. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు పదిహేనేళ్ల ముందు (2008 నవంబర్ 14న) మన దేశానికి చెందిన చంద్రయాన్-1 మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) చంద్రుని ఉపరితలంపై దిగేందుకు యత్నించింది. ఆ ప్రదేశానికి ‘జవహర్ పాయింట్’ లేదా ‘జవహర్ స్థల్’ అనే పేరు పెట్టారు. దాన్ని కూడా అప్పట్లోనే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ధ్రువీకరించింది.