'యూసీసీతో ఐక్యతకు భంగం'.. లా కమిషన్‌కు ముస్లిం లీగ్ లేఖ

by Vinod kumar |
యూసీసీతో ఐక్యతకు భంగం.. లా కమిషన్‌కు ముస్లిం లీగ్ లేఖ
X

తిరువనంతపురం: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ను తీసుకొస్తే దేశంలో ఐక్యత, సమగ్రతకు భంగం కలుగుతుందని కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభిప్రాయపడింది. యూసీసీపై లా కమిషన్‌కు ముస్లిం లీగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష ఉపనేత పీకే కున్హాలికుట్టి ఈ శుక్రవారం లేఖ రాశారు. దేశంలోని బహుళత్వాన్ని నాశనం చేసే యూసీసీని అమలు చేయొద్దని కోరారు. ‘రాజ్యాంగం ప్రతి పౌరుడి వ్యక్తిత్వాన్ని, విశ్వాసాన్ని గౌరవిస్తుంది.

అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. ప్రజల మతపరమైన, సంస్కృతిక హక్కులను కేంద్ర ప్రభుత్వం అతిక్రమించరాదు’ అని లా కమిషన్‌కు రాసిన లేఖలో కున్హాలికుట్టి పేర్కొన్నారు. 1937 షరియత్ చట్టం ప్రకారం.. షరియా చట్టాన్ని అనుసరించాలనుకునే వారికి యూసీసీ ఆటంకం కలిగిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed