కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. త్వరలోనే బీజేపీలోకి మరో బిగ్ షాట్..?

by Satheesh |   ( Updated:2024-02-17 15:02:40.0  )
కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. త్వరలోనే బీజేపీలోకి మరో బిగ్ షాట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అధికారం పొగొట్టుకున్న కాంగ్రెస్.. కేవలం తెలంగాణలో స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎదురుదెబ్బ నుండి కోలుకోక ముందే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన ఇండియా కూటమిలో బీటలు వారాయి. ఎన్నికల ముందే ఇండియా కూటమి విచ్ఛిన్నం అయ్యింది. కాంగ్రెస్ తీరుతో పలు పార్టీలు కూటమి నుండి బయటకు వెళ్లాయి.

సీట్ల పంపకంలో సయోధ్య కుదరకపోవడంతో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇదిలా ఉండగానే.. కాంగ్రెస్‌ పార్టీకి సొంత నేతలే భారీ షాకిస్తున్నారు. పార్టీలోని కీలక నేతలు వరుసగా కాంగ్రెస్‌ను వీడుతున్నారు. మిలింద్ దేవర, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి, అశోక్ చవాన్, బాబా సిద్ధిక్ వంటి సీనియర్ లీడర్స్ రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ నేత కమలనాథ్ సైతం కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతారని నేషనల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగానే, కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలేటట్లు కనిపిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ కీలక నవ్యజోత్ సింగ్ సిద్ధూ హస్తానికి టాటా చెప్పనున్నట్లు సమాచారం. హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కి్ల్స్‌లో వార్తలు జోరందుకున్నాయి. సిద్ధూ కాంగ్రెస్‌ను వీడి త్వరలోనే బీజేపీ చేరనున్నట్లు సమాచారం. ఒక వేళ ఇది కనుక జరిగితే పార్లమెంట్ ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ దెబ్బేనని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరీ సిద్ధూ పార్టీ మారుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Read More..

రైతులకు నీరు ఇవ్వకుండా మోసం చేసిందే BRS: ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

Advertisement

Next Story

Most Viewed