రాష్ట్రంతో దంచికొడుతున్న వర్షాలు.. సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

by Mahesh |   ( Updated:2023-11-14 05:54:48.0  )
రాష్ట్రంతో దంచికొడుతున్న వర్షాలు.. సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆకాశంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు తెల్లవారుజామునుంచే నల్లగా కమ్మేసిన మేఘాలతో ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభం అయింది. దీంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని నాగపట్నం, కడలూరు, ఆళ్వార్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ నెల 13, 14 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరికాలు జారీ చేసిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నేడు.. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

Advertisement

Next Story