- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ISRO: ఇస్రో మరో అరుదైన ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-60
దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం సక్సెస్ అయింది. సరిగ్గా సోమవారం(డిసెంబర్ 30, 2024) రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ స్పేడెక్స్ మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం చేసింది. తొలుత సోమవారం రాత్రి 9.58 గంటలకు అనుకున్నా.. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా 10 గంటల 15 సెకన్లకు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్(Somnath) తెలిపారు. ఇది స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం కావడం విశేషం. స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్, అన్‌డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి, ప్రదర్శన స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో స్పష్టం చేసింది.