- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel: సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్ బొల్లా కమాండర్ మృతి
దిశ, నేషనల్ బ్యూరో: హెజ్ బొల్లాపై ఇజ్రాయెల్(Israel) దాడులు కొనసాగిస్తూనే ఉంది. సిరియా(Syria)లోని డమాస్కస్‌కు దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన కమాండర్‌తో(Hezbollah Commander) సహా తొమ్మిది మంది మరణించారని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. లెబనీస్ కుటుంబాలు(Lebanese), హెజ్‌బొల్లా(Hezbollah) సభ్యులు నివసించే అపార్ట్‌మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయటంతో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, మృతిచెందిన హెజ్ బొల్లా కమాండర్ కు లెబనీస్ పౌరసత్వం ఉందని.. సిరియాలో కీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఇజ్రాయెల్ పేర్కొంది.
తొమ్మిది మంది మృతి
‘‘ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన కమాండర్ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతను లెబనీస్ జాతీయుడు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. సిరియాకు చెందిన నలుగురు పౌరులు, హిజ్‌బొల్లాల కమాండర్‌తో సహా మరో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన కమాండర్ పేరు తెలియాల్సి ఉంది ’’ అని బ్రిటన్ ఆధారిత వార్ మానిటర్‌కు నాయకత్వం వహిస్తున్న రామి అబ్దేల్ రెహ్మాన్ వెల్లడించారు. మరోవైపు.. శనివారం ఉత్తర, వాయువ్య సిరియాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన ఐదుగురిలో నలుగురు ఇరాన్ అనుకూల ఫైటర్లు ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. హెజ్‌బొల్లా సైనిక స్థావరాలు, ఫైటర్ల లక్ష్యంగా దాడులు చేసింది. సిరియాలో ఇరాన్ తన ఉనికిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది. సెప్టెంబరు 23న లెబనాన్‌లోని హెజ్‌బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది.