Air India passenger: నా బ్యాగులో బాంబుందా?

by Shamantha N |
Air India passenger: నా బ్యాగులో బాంబుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడ్ని అరెస్ట చేశారు. ఆదివారం ఉదయం మనోజ్ కుమార్(42) అనే ప్రయాణికుడు భద్రతా తనిఖీలు జరుగుతుండగా.. విచిత్ర వ్యాఖ్యలు చేశారు. సెక్యూరిటీ చెక్ దగ్గర తన బ్యాగ్ తీసుకుంటా అందులో “నా బాంబు ఏదైనా ఉందా” అని ప్రశ్నించాడు. దీంతో, ఎయిర్ పోర్టు ఎక్స్ రే బ్యాగేజ్ దగ్గరున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై అతడ్ని అరెస్టు చేశారు. అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను రప్పించారు. నిందితుడి లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్యాబిన్‌ బ్యాగులతో పాటు చెకిన్‌ బ్యాగేజీని బాంబు డిటెక్షన్‌ మెషిన్లతో తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత మనోజ్ కుమార్‌ను పోలీసులకు అప్పగించారు. అయితే, తదుపరి విచారణ కోసం మనోజ్‌కుమార్‌ ఎయిర్‌ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. కాగా.. షెడ్యూల్ ప్రకారం విమానం బయల్దేరిందని ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

బాంబు, హైజాక్ వంటి పదాలపై నిషేధం

ఎయిర్‌పోర్ట్‌లు బెదిరింపులకు పాల్పడితే అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రత్యేకించి "బాంబు", "హైజాక్" వంటి పదాలు వాడటం నిషేధం. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతకు సంబంధించి తమాషాగా చేసే బెదిరింపులపైనా నిరసన వ్యక్తం చేస్తింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే విమానాల్లో ప్రయాణించకుండా నిషేధిస్తారు. మరికొన్ని సందర్భాల్లో జరిమానాలు కూడా విధిస్తారు. ఈ ఏడాది జూన్‌లో కొచ్చి నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. టికెట్స్ రీషెడ్యూల్ చేయకపోవడంతో ఇలా చేశాడని పోలీసులు తేల్చారు.

Advertisement

Next Story

Most Viewed