ఇది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా?.. కన్నడ నటి బావోద్వేగ ట్వీట్

by Disha Web Desk 5 |
ఇది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా?.. కన్నడ నటి బావోద్వేగ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులో తమకు ఎదురైన షాకింగ్ ఘటనపై స్పందించిన కన్నడ నటి ఇది పాకిస్తానా?, ఆఫ్ఘనిస్తానా? అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది. కన్నడ భాషలో మాట్లాడినందుకు తమపై కొందరు వ్యక్తులు దాడి చేశారని, దీనికి సంబందించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త నటుడు భువన్ పొన్నన్న కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ లోని పులికేశి నగర్ లో ఓ రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి తిరిగి వచ్చేందుకు కారు తీశామని చెప్పారు. ఇంతలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు తమ కారు డ్రైవర్ సీటు వద్దకు వచ్చి కారు పెద్దదిగా ఉంది. ఒక్కసారిగా కదిలిస్తే తమకు తాకుతుందని వాదించడం ప్రారంభించారని చెప్పుకొచ్చింది.

దానికి తన భర్త కారు ఇంకా కదలలేదు దయచేసి పక్కకి జరగండి అని కన్నడ భాషలో చెప్పారని, దానికి వారు మాపై దుర్భాషలాడుతూ.. ఈ కన్నడ ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలని తమ భాషలో మాట్లడుతూ దాడి చేసే ప్రయత్నం చేశారని తెలిపింది. ఇది జరిగిన రెండు మూడు నిమిషాల్లో అక్కడికి 20 నుంచి 30 మంది వ్యక్తులు గుమిగూడారిని, వారిలో ఇద్దరు వ్యక్తులు తన భర్త పొన్నన్న బంగారు గొలుసు లాక్కెళ్లెందుకు ప్రయత్నించారని, దీన్ని గమణించి ఆ చైన్ ను తనకిచ్చాడని రాసుకొచ్చింది. ఈలోపు వారు తమ కారును ధ్వంసం చేశారని, యే లోకల్ కన్నడ వాలా హే అని వారు మాట్లాడుకోవడం విన్నానని, తాము కన్నడ భాషలో మాట్లాడుకోవడం వారిని మరింత రెచ్చగొట్టిందని, వారిలో కొందరు హిందీ, ఉర్దూ, మరికొన్ని భాషల వాళ్లు ఉన్నారని ఈ పోస్టు కింద రాసుకొచ్చింది.

తాము తమకు పరిచయమున్న ఇన్ స్పెక్టర్ కు ఫోన్ చేశామని ఈలోపు ఆ ముఠా పారిపోయారని తెలిపింది. అక్కడే ఉన్న ఓ ఏఎస్ఐ ను కలిసి సహయం చేయమని అడిగితే ఆయన మా వాదన వినకుండా నిర్లక్ష్యంగా బత్తాయి జ్యూస్ తాగుతున్నాడని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఘటన తనని బయటకు వెళ్లకుండా భయపెట్టిందని, మేము పాకిస్తాన్ లో నివసిస్తు్న్నామా? లేదా ఆఫ్ఘనిస్తాన్ లో జీవిస్తున్నామా? నా సొంత ఊరిలో నా భాష కన్నడ వాడటం తప్పా..? మన సొంత ఊర్లో మనం నిజంగా ఎంత సురక్షితంగా ఉన్నాము అని రాసుకొచ్చింది.

Next Story