విండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌పై ఐదేళ్లు నిషేధం

by Harish |
విండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌పై ఐదేళ్లు నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్ వికెట్ కీపర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ వేటు వేసింది. ఐదేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్లలో ఇది వర్తిస్తుందని ఐసీసీ తెలిపింది. శ్రీలంక ప్రీమియర్ లీగ్‌‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించడంతోపాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్, అబుదాబి టీ10 లీగ్‌ల్లో అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్టు అతనిపై ఏడు అభియోగాలు వచ్చాయి. తాజా విచారణలో డెవాన్ థామస్ అంగీకరించడంతో ఐసీసీ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. కాగా, 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను విండీస్ తరపున ఒక టెస్టు, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. 2022 డిసెంబర్‌లో విండీస్ తరపున చివరగా టెస్టులో పాల్గొన్నాడు.

Advertisement

Next Story