Iraq: వివాహానికి 9 ఏళ్ల వయసు.. బాలికను పెళ్లి చేసుకోవచ్చు.. చట్ట సవరణ చేయనున్న ఇరాక్

by Mahesh Kanagandla |
Iraq: వివాహానికి 9 ఏళ్ల వయసు.. బాలికను పెళ్లి చేసుకోవచ్చు.. చట్ట సవరణ చేయనున్న ఇరాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాక్(Iraq) దేశం మరో తిరోగమన నిర్ణయానికి రెడీ అవుతున్నది. కనిష్టంగా 9 ఏళ్లున్న బాలిక(9 Year Old Girl)నూ పురుషుడు పెళ్లి(Marriage) చేసుకోవచ్చనే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. అలాగే, విడాకులు తీసుకునే హక్కు, వారసత్వం సంపదపై హక్కు, పిల్లలను అధీనంలో ఉంచుకునే హక్కునూ వారికి లేకుండా వివాహ చట్టాలకు సవరణలు చేయనుంది. కుటుంబ వివాదాలను పరిష్కరించడానికి మతాధికారి లేదా పౌర న్యాయాధికారులను సంప్రదించవచ్చనే ప్రతిపాదననూ రెడీ చేసింది. బాలికలను అనైతిక సంబంధాల నుంచి కాపాడటానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఇరాక్‌లోని షియా పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సమర్థించుకుంది. ఇరాక్ మహిళా సంఘాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా ఈ సవరణలు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. యూనిసెఫ్ రిపోర్టు ప్రకారం ఇరాక్‌లో బాల్యవివాహాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ఆ దేశంలోని సుమారు 28 శాతం మంది బాలికలు(18 ఏళ్లలోపు) వివాహం చేసుకున్నారు. బాలికకు ఇష్టం లేకున్నా ఆమె తండ్రి ఆమోదంతో మతాధికారి పెళ్లి చేసే అధికారాన్ని ఇరాక్ చట్టాలు కట్టబెడుతున్నాయి. ఇది వరకు ఇలా చాలా వివాహాలు జరిగాయి. తాజా సవరణ చట్టరూపం దాల్చితే ఆ వివాహాలన్నీ చట్టబద్ధమయ్యే ముప్పుంది. ఈ సవరణతో బాలికలు శారీరక హింసను ఎదుర్కోవడమే కాదు, విద్యా ఉపాధికీ దూరమయ్యే ప్రమాదముంది.

Advertisement

Next Story

Most Viewed