- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Iran-US: ట్రంప్ పై హత్యాయత్నాలు.. స్పందించిన ఇరాన్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై వరుసగా హత్యాయత్నాలు జరిగాయి. కాగా.. వాటి వెనుక ఇరాన్ (Iran) హస్తం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాగా.. దీనిపైనే టెహ్రాన్ స్పందించింది. ట్రంప్ చంపే ఉద్దేశం లేదని చెప్పింది. ఈ మేరకు బైడెన్ (Joe Biden) ప్రభుత్వానికి సందేశం పంపినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అక్టోబరులోనే ఇరాన్ వివరణ పంపించినట్లు తెలిపింది. ‘‘సులేమానీ హత్య నేరపూరిత చర్యే. అయితే దీనిపై మేం అంతర్జాతీయ న్యాయ మార్గాల్లోనే పోరాటం చేస్తాం. అంతేగానీ, హింస సృష్టించి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవట్లేదు. ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం మాకు లేదు’’ అని ఇరాన్ తమ సందేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌ను ఇరాన్ అధికారులు కూడా ధ్రువీకరించినట్లు ఆ స్టోరీ తెలిపింది. దీనిపై అగ్రరాజ్య అధికారులు ఇంకా స్పందించనప్పటికీ.. టెహ్రాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నుంచే ఈ సందేశం వచ్చినట్లు సమాచారం.
ట్రంప్ పై హత్యాయత్నాలు
అయితే, ట్రంప్ హయాంలో 2020లో జరిగిన ఇరాన్ (Iran) మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు వార్తలొచాయి. కాగా.. ఈ ఏడాది సెప్టెంబరులో బైడెన్ ప్రభుత్వం టెహ్రాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌నకు హాని తలపెట్టాలని చూస్తే.. దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపైనే ఇరాన్ ఈ విధంగా స్పందించింది. మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ (Donald Trump)పై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఇద్దరు అమెరికా పౌరులను ఇటీవల ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి (ఐఆర్‌జీసీ) చెందిన ఓ అధికారి ఈ కుట్రలో కీలక పాత్ర పోషించాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. ఐఆర్‌జీసీ అధికారి సూచనల ప్రకారమే ఇరాన్‌లో ఉంటున్న ఫర్హాద్ షకేరీ.. అమెరికాలో తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఈ హత్య ప్రణాళికను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్నాడని పేర్కొంది. ఆ ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నామని ఎఫ్‌బీఐ తెలిపింది. సూచనలు అందితేనే ట్రంప్ హత్యకు ప్రణాళికలు రచించినట్లు షకేరీ తెలిపినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.