- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IAEA: భారీస్థాయిలో యూరేనియం శుద్ధికి ఇరాన్ ప్లాన్
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ పై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) సంచలన విషయాలు బయటపెట్టింది. ఇరాన్(Iran) భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అందులో భాగంగా యురేనియం శుద్ధి కోసం 6,000 అదనపు సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఐఏఈఐ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే టెహ్రాన్ దగ్గర 10 వేల సెంట్రిఫ్యూజ్ లు ఉండగా.. ఇప్పుడు అదనంగా ఏర్పాటు చేయడంపై ఐఏఈఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం ఐఏఈఏ 35 దేశాల బోర్డ్ గవర్నర్స్ ఇరాన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ అభ్యర్థన మేరకు ఈ తీర్మానాన్ని ఐఏఈఏ ఆమోదించింది. దీంతో, ఇరాన్ ఈ చర్య చేపట్టింది.
90 శాతం శుద్ధి
ఈ అదనపు సెంట్రిఫ్యూజ్‌ల ఏర్పాటుతో ఇరాన్ చాలా వేగంగా అణు ఇంధనాన్ని శుద్ధి చేయగల సామర్థ్యాన్ని పొందుతుంది. సాధారణంగా 60శాతం శుద్ధి చేసిన యురేనియాన్ని పౌర అవసరాలకు వాడుతారు. అదే 90శాతానికి పైగా శుద్ధి చేస్తే అణు బాంబులకు మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 10,000 సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయి. ఇవి నటాంజ్, ఫార్డో ప్లాంట్స్ లో అమర్చారు. నటాంజ్ ప్లాంట్ దగ్గర భూమి ఉపరితలంపై కూడా ఓ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక్కోదానిలో 160 యంత్రాలు ఉండేలా 32 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయాలని టెహ్రాన్ ప్లాన్ చేస్తోంది. ఇక, గత వారం ఐఏఈఏ త్రైమాసిక సమావేశం సందర్భంగా ఇరాన్ ప్రతినిధులు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. తమ దేశం 60శాతం శుద్ధి చేసిన యురేనియం స్టాక్‌పై పరిమితులు విధించుకొంటామని తెలిపింది. దానికి బదులుగా ఐఏఈఏ బోర్డు తమ దేశానికి వ్యతిరేకంగా ఏ తీర్మానం చేయకూడదని ప్రపోజల్ పెట్టింది.