అది స్టేడియమా.. వాటర్ ఫాలా (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-05-30 06:48:00.0  )
అది స్టేడియమా.. వాటర్ ఫాలా (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వర్షం కురిస్తే వరదలతో నిండిపోయింది. మెట్లపై నుండి వరద నీరు.. వాటర్ ఫాల్‌లో మాదిరి ఏరులై పారింది. ఆది, సోమవారాలు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ మధ్యలో నెలకొన్న దృశ్యాలు ఇవి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అయితే, ఒక్క వర్షం పడగానే రూ.700 కోట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వరద నీటితో నిండిపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు.. వాటర్ ఫాల్ కనిపించి ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్తు సెటైర్లు వేస్తున్నారు. ‘వాహ్ మోడీ జీ.. వాహ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, బీసీసీఐపై కూడా నెటిజన్లు, ప్రేక్షకులు మండిపడ్డారు.

అయితే, మ్యాచ్ మధ్యలో వర్షం పడింది. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేసిన సిబ్బంది నీళ్లు తోడేందుకు స్పాంజ్‌ను ఉపయోగించడం విమర్శలకు కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వాటిని చూసిన నెటిజన్లు బీసీసీఐపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చిన డబ్బంతా ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ స్పాంజ్‌లను ఉపయోగించడం విడ్డూరంగా ఉందని, నీటిని తోడేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ఈసారి ఐపీఎల్ ఫైనల్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. చివరకు నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన ఘన విజయం సాధించింది.

Advertisement

Next Story