Rajasthan: ఉదయ్‌పూర్‌లో 24 గంటలపాటు ఇంటర్నెట్ బంద్

by S Gopi |
Rajasthan: ఉదయ్‌పూర్‌లో 24 గంటలపాటు ఇంటర్నెట్ బంద్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ డివిజనల్ కమిషనర్ నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడిచిన కారణంగా హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. దాంతో నగరంలో శాంతిభద్రతల పరిస్థితులను అదుపులో ఉంచేందుకు కమిషనర్ కార్యాలయం ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి జాతీయ మీడియాతో మాట్లాడిన ఉదయ్‌పూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్.. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగినట్టు మాకు సమాచారం ఉంది. ఓ పిల్లవాడు మరో విద్యార్థి తొడలపై కత్తితో దాడి చేయడంతో గాయం లోతుగా మారింది. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 'తాను బాధిత చిన్నారిని కలిశాను. ప్రస్తుత అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎలాంటి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవచ్చని ప్రజలకు విజ్ఞత్పి చేస్తున్నాను. కత్తితో దాడి చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ' వివరించారు. ఈ ఘటనలో ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా అనే దిశగా దర్యాప్తు జరుగుతోందన్నారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటం తమ కర్తవ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story