పంజాబ్‌లో ఫిబ్రవరి 24 వరకు ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు

by S Gopi |
పంజాబ్‌లో ఫిబ్రవరి 24 వరకు ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై నిరసనను రైతులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాటియాలా, సంగ్రూర్, ఫతేఘర్ సాహిబ్‌తో పాటు పంజాబ్‌లోని కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని ఫిబ్రవరి 24 వరకు పొడిగించారు. గతంలో ఫిబ్రవర్ 12-16 మధ్య ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేయడానికి కేంద్రం 1885 టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించింది. పాటియాలా, సంగ్రూర్, ఫతేఘర్ సాహిబ్‌తో పాటు మొహాలి, భటిండా, ముక్త్‌సర్‌, మాన్సాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ ఇంటర్నెట్ బ్యాన్ కొనసాగనుంది. ఫిబ్రవరి 15న చండీగఢ్‌లో ముగ్గురు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే అంశాన్ని లేవనెత్తారు. మరోవైపు, హర్యానా ప్రభుత్వం సోమవారం వరకు ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగించింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్స్ ఎస్ఎంఎస్‌లను హర్యానా ప్రభుత్వం నిషేధించింది.

Advertisement

Next Story