- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హనీమూన్‌కు బదులుగా అయోధ్యకు.. విడాకులు కోరిన భార్య
దిశ, నేషనల్ బ్యూరో: ఓ భర్త తన భార్యను హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య విడాకులకు అప్లై చేసింది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఐదు నెలల క్రితం వివాహమైంది. దీంతో ఈ జంట గోవా, దక్షిణ భారతదేశ పర్యటనకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. కానీ టూర్‌కు వెళ్లే ముందు భర్త ప్లాన్ మార్చాడు. తన తల్లి కోరిక మేరకు గోవాకు బదులుగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో మహిళ తన భర్త, అత్తమామలతో కలిసి టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే అసంతృప్తికి గురైన భార్య ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన 10రోజుల తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త తన కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఫ్యామిలీ కోర్టు అడ్వకేట్ అవస్తీ తెలిపారు.