- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఫైర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ హయాంలో అలీన విధానంతో ముందుకు సాగితే.. మోడీ హయాంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా భారత్ ముందుకు సాగుతోందని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. "ఇప్పుడు దేశ సైనిక సామర్థ్యం పెరిగింది. మన ఆత్మవిశ్వాసం పెరిగింది. వాటికి అనుగుణంగా మన దేశం ముందున్న సవాళ్లు మారాయి. మనం ఏర్పర్చుకున్న లక్ష్యాలు మారాయి" అని పేర్కొన్నారు. ఆర్థిక విధానాలకు అనుగుణంగా విదేశాంగ విధానాలను రూపొందించుకొని ముందుకు సాగుతుండటం వల్ల మోడీ పాలనలో ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. "ఆకాశవాణి"కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సైద్ధాంతిక కారణాల వల్ల దేశ ప్రయోజనాలకు తిలోదకాలిచ్చారని ఆరోపించారు. "సైద్ధాంతిక కారణాలు, అలీన విధాన నిబంధనల వల్ల దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ పణంగా పెట్టింది. ఇప్పుడు దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం" అని జైశంకర్ స్పష్టం చేశారు.