పాకిస్తాన్ కు వెళ్లి ఫేస్ బుక్ ఫ్రెండ్ను పెళ్లాడిన భారతీయ మహిళ

by Javid Pasha |   ( Updated:2023-07-26 11:27:03.0  )
పాకిస్తాన్ కు వెళ్లి ఫేస్ బుక్ ఫ్రెండ్ను పెళ్లాడిన భారతీయ మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కు వెళ్లి ఫేస్ బుక్ ఫ్రెండ్ ను పెళ్లాడింది అంజు అనే భారతీయ మహిళ. అనంతరం ఇస్లాంలోకి మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియాకు చెందిన అంజు అనే వివాహితకు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మారుమూల గ్రామానికి చెందిన నస్రుల్లాకు కొన్నేళ్ల కిందట ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంజు పాకిస్తాన్ వెళ్లింది.

అనంతరం అప్పర్ దిర్ కోర్టులో నికాహ్ పేరుతో జరిగి వేడుకలో వారిద్దరికి వివాహం జరిగింది. వివాహం తర్వాత ‘అంజూ వెడ్స్ నస్రుల్లా’ అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు ఈ నవ దంపతులు. కాగా వివాహం నేపథ్యంలో అంజూ ఇస్లాంలోకి మారింది. తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. కాగా అంతకు ఒక్కరోజు ముందు నస్రుల్లాను వివాహం చేసుకునే ఉద్దేశం తనకు లేదని, ఆగస్టు 20న తన వీసా గడువు పూర్తయ్యేలోగా తాను ఇండియాకు వస్తున్నట్లు అంజు చెప్పింది. కానీ అలా చెప్పిన 24 గంటల్లోనే నస్రుల్లాను ఆమె పెళ్లి చేసుకుంది.

Advertisement

Next Story