రైలు ప్రయాణికులకు శుభవార్త! ఇక‌పై అవి మీరు తీసుకెళ్ల‌న‌వ‌స‌రం లేదు!!

by Sumithra |
రైలు ప్రయాణికులకు శుభవార్త! ఇక‌పై అవి మీరు తీసుకెళ్ల‌న‌వ‌స‌రం లేదు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః రైలు ప్రయాణ‌మంటే చాలా మందికి సౌక‌ర్యంగా ఉంటుందని ఇష్ట‌మే. కానీ, తినుబండారాల నుంచి దుప్ప‌ట్లు, దిండ్లు కూడా మోసుకెళ్లాల్సి వ‌స్తుంద‌ని ఈ మ‌ధ్య మ‌రీ ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే, క‌రోనా త‌ర్వాత రైలు ప్ర‌యాణికుల‌కు పెద్ద ఉపశమనమే ప్ర‌క‌టించింది రైల్వే శాఖ‌. రైళ్లలో దుప్పట్లు, దిండ్లు, క‌ర్టెన్ల అందించే సౌక‌ర్యాన్ని తిరిగి ప్రారంభించింది. దీనికి సంబంధించి గురువారం భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రైల్వే జోన్‌ల జనరల్ మేనేజర్‌లకు జారీ చేసిన ఈ ఆదేశాల్లో, ఈ వస్తువుల సరఫరా తక్షణమే అమలులోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది.

ఇటీవ‌ల విజృంభించిన కోవిడ్-19 కేసుల దృష్ట్యా ప‌లు ఆంక్ష‌లు విధించ‌డంతో కొంత కాలం ఈ సౌక‌ర్యాన్ని నిలిపివేశారు. ఇక‌, తాజా అధికారిక ఉత్తర్వుల‌ ప్రకారం, రైలు లోపల లెనిన్‌ దుప్పట్లు, కర్టెన్ల సరఫరా తక్షణమే అమలులోకి వ‌చ్చింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఈ సౌక‌ర్యాన్ని అమ‌లుచేస్తుండ‌టంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

Advertisement

Next Story