అమెరికాలో భారత జనరిక్ మెడిసిన్ హవా

by Mahesh |   ( Updated:2024-05-21 10:05:52.0  )
అమెరికాలో భారత జనరిక్ మెడిసిన్ హవా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న. చిన్న పరిశ్రమ నుంచి భారీ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది. ఇందులో ముఖ్యంగా భారత జనరిక్ మెడిసిన్ తయారు చేస్తూ.. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు అమెరికాలో సత్తా చాటుతున్నాయి. 2022 సంవత్సరంలో అమెరికాలో రోగులు వినియోగించిన మొత్తం జనరిక్ లో 47 శాతం.. భారత్ కు చెందిన జనరిక్ కంపెనీలు తయారు చేసినవే ఉన్నట్లు నివేదికలు వెలుబడ్డాయి. ముఖ్యంగా మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్, డయాబెటిస్ వంటి వ్యాదులకు సంబంధించిన మందులు ఎక్కువగా అమెరికన్లు వాడుతున్నారు. దీంతో 2022లో యూఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ 216 బిలియన్ డాలర్లను ఆదా చేయగలిగింది. అలాగే 2013 నుంచి 2022 మధ్య కాలంలో ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో భారత్ లో తయారైన జనరిక్ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read More..

పోస్టులను భర్తీ చేయకుండా బీజేపీ రిజర్వేషన్లను హిందూ-ముస్లిం సమస్యగా మారుస్తోంది: ఖర్గే

Advertisement

Next Story