Indian Army: 72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ

by Indraja |
Indian Army: 72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ
X

దిశ వెబ్ డెస్క్: సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి BRO , స్థానిక పరిపాలన అధికారుల ప్రయత్నాలకు భారత ఆర్మీ మద్దతు తెలిపింది. కాగా భారత ఆర్మీలోని త్రిశక్తి కార్ప్స్ యొక్క ఆర్మీ ఇంజనీర్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సాంకేతిక అడ్డంకులను లెక్కచేయకుండా డిక్చూ-సంక్లాంగ్ రహదారిపై 70 అడుగుల ఐరన్ వంతెనను నిర్మించారు.

కాగా ఈ వంతెన నిర్మాణం పనులను ఈనెల 23వ తేదీన ప్రారంభించిన ఆర్మీ కేవలం 72 గంటల్లో పూర్తి చేశారు. డిక్చూ-సంక్లాంగ్ వరకు చుంగ్తాంగ్ వైపు వాహనాల రాకపోకలకు ఈ వంతెన మార్గమే ప్రధానం. కాగా ఈ వంతెనను మంగన్ జిల్లాలోని బాధిత ప్రజలకు వైద్య సహాయంతో పాటు ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు సహాయపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed