హైదరాబాదీ సంస్థకు రూ.4,800 కోట్ల ప్రాజెక్టు.. షోల్డర్ మిస్సైల్స్ తయారీకి ఆర్డర్

by Shamantha N |
హైదరాబాదీ సంస్థకు రూ.4,800 కోట్ల ప్రాజెక్టు.. షోల్డర్ మిస్సైల్స్ తయారీకి ఆర్డర్
X

నేషనల్ బ్యూరో: సరిహద్దుల్లో భద్రతను పెంచేందుకు.. శత్రుదేశాల బెదిరింపులు ఆపేందుకు చర్యలు చేపట్టింది రక్షణ శాఖ. చైనా, పాక్ సరిహద్దుల్లో వైమానిక బెదిరింపులు ఎదుర్కొనేందుకు షోల్డర్ ఫైర్డ్ మిస్సైల్స్ ని తయారు చేసేందుకు సిద్ధమైంది. రూ. 6,800 కోట్లతో తక్కువ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యింది రక్షణ శాఖ.

దేశీయంగానే 500 లాంచర్లు, 3 వేల క్షిపణులు అభివృద్ధి చేసి కొనుగోలు చేసే ప్రణాళికలు వేస్తోంది భారత సైన్యం. ఇఖపోతే, ఇగ్లా-1ఎమ్ క్షిపణులకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రష్యన్ ఇగ్లా-ఎస్‌ను ఎంపిక చేసిన పాత టెండర్‌ను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది రక్షణశాఖ.

ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ జాబితాలో ప్రస్తుతం ఉన్న వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ ఢిపెన్స్ సిస్టమ్ మిసైల్స్ అన్నీ ఐఆర్ హోమింగ్ గైడెన్స్ సిస్టమ్స్ తోనే ఉన్నాయి. మిసైల్స్ తయారీ కోసం ప్రస్తుతం రూ. 4800 కోట్ల ప్రాజెక్ట్ ఉందని పేర్కొన్నారు రక్షణ దళాల అధికారులు. హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, పూణేకు చెందిన ప్రైవేటు సంస్థ.. రెండూ కలిసి లేజర్ బీమ్ రైడింగ్ మిసైల్స్ తయారు చేసే పనిలో పడ్డాయి. సరిహద్దు రక్షణలో భాగంగా భారత బలగాలకు ఈ మిసైల్స్ ఉపయోగపడనున్నాయి. శత్రుదేశాల డ్రోన్లు, ఫైటర్ ఎయిర్ క్లాఫ్ట్ లు, హెలికాప్టర్ల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపారు అధికారులు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం 200 లాంచర్లు, 1200 క్షిపణులు అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్టు అని తెలిపారు. అందులో700 మిసైల్స్ ఆర్మీ కోసం వాడుకోగా.. మిగతావి ఎయిర్ ఫోర్స్ కు ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు.

Advertisement

Next Story

Most Viewed