- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చాబహార్ ఓడరేవులో కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం
దిశ, నేషనల్ బ్యూరో: చాబహార్ పోర్ట్ నిర్వహణకు సంబంధించి మరో దశాబ్దం పాటు పర్యవేక్షించేందుకు ఇరాన్‌తో భారత్ ఒప్పందంపై సంతకం చేస్తుందని మీడియా కథనాలు వెలువడ్డాయి. 2016లో జరిగిన ఒప్పందాన్ని కొనసాగించేందుకు కావాల్సిన కీలక పత్రాలపై సంతకాలు చేయడానికి కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం ఇరాన్‌కు వెళ్లారు. కథనాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ 2016లో ఇరా పర్యటనకు వెళ్లిన సమయంలో చాబహార్ ఓడరేవుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీన్ని కొనసాగించేందుకు ఇప్పుడు మళ్లీ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. విదేశాల్లో ఓడరేవు నిర్వహించడం భారత్‌కు ఇదే తొలిసారి. ఇరాన్ ద్వారా రష్యాతో భారత కనెక్టివిటీని సులభతరం చేస్తూ, చాబహార్ పోర్ట్‌ను ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్‌టీసీ)తో అనుసంధానించడానికి ప్రస్తుతం ప్రణాళికలు జరుగుతున్నాయి. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) దేశాలను చేరేందుకు ఈ ఐఎన్ఎస్‌టీసీలో చాబహార్ పోర్ట్‌ను కేంద్రంగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. దీనివల్ల భారత్, మధ్య ఆసియా సరుకు రవాణాకు అనుకూలంగా మారుతుంది. చాబహార్ పోర్ట్ భారత్‌కు వాణిజ్య రవాణా కేంద్రంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించే విదేశీ ఇన్వెస్టర్లకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అంచనా.