దేశంలో మొదటి ప్రైవేట్ ముడి చమురు స్టోరేజ్‌ను నిర్మించనున్న కేంద్రం

by S Gopi |
దేశంలో మొదటి ప్రైవేట్ ముడి చమురు స్టోరేజ్‌ను నిర్మించనున్న కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మొదటి ప్రైవేట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్(ఎస్‌పీఆర్)ను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. దీన్ని 2029-30 నాటికి పూర్తి చేయాలని, నిల్వ చేసిన చమురు మొత్తాన్ని వ్యాపారం చేసే స్వేచ్ఛను ఆపరేటర్‌కు కల్పించవచ్చని ఇండియన్ స్టాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్‌పీఆర్ఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పూర్తిగా కమర్షియల్ ఎస్‌పీఆర్‌ను అనుమతించే విధానాన్ని జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు అనుసరించే పద్దతిలో ఉండేలా కేంద్రం అనుమతిలివ్వనుంది. ఆయా దేశాలు ప్రైవేట్ లీజుదారులు ముఖ్యంగా బడా చమురు కంపెనీలకు చమురు వర్తకం చేసేందుకు అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు దేశీయంగా దక్షిణ భారత్‌లో మూడు ఎస్‌పీఆర్‌లు పాక్షిక వాణిజ్యానికి మాత్రమే అనుమతించబడ్డాయి. ఇవి 3.67 కోట్ల బ్యారెళ్ల సంయుక్త సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కేంద్ర రెండు ఎస్‌పీఆర్‌లను నిర్మించాలని భావిస్తోంది. మొదటిది దక్షిణ కర్ణాటకలోని పాదూర్‌లో 1.83 కోట్ల బ్యారెళ్లతో, తూర్పు ఒడిశా రాష్ట్రంలో 2.93 బ్యారెళ్ల ఎస్‌పీఆర్‌లను నిర్మించనుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో చమురు మొత్తాన్ని స్థానికంగా వ్యాపారం చేసేందుకు వీటిని అనుమతిస్తారు. దేశీయంగా కొరత ఏర్పడీతే చమురుపై ప్రభుత్వానికే మొదటి హక్కు ఉంటుందని ఐఎస్‌పీఆర్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎల్ ఆర్ జైన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story