మాకు మరింత సాయం చేయండి.. భారత్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి లేఖ

by Vinod kumar |
మాకు మరింత సాయం చేయండి.. భారత్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి లేఖ
X

న్యూఢిల్లీ: సాయం కావాలని కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అదనపు సాయంగా మెడిసిన్, వైద్య పరికరాలు ఇవ్వాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాజాగా భారత్ వచ్చిన ఉక్రెయిన్ మంత్రి కూడా చర్చల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. దీంతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే జీ20 అధ్యక్ష సమ్మిట్‌లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు.

అయితే దీనిపై భారత్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. యుద్ధంలో దెబ్బతిన్న దేశం విదేశీ వైద్య విద్యార్థులను వారి నివాస దేశంలో యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ పరీక్షలో పాల్గొనడానికి అనుమతిస్తుందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌ను విడిచిపెట్టవలసి వచ్చిన వేలాది మంది భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించిందని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో మౌళిక సదుపాయాలను తిరిగి నిర్మించడం భారత కంపనీలకు అవకాశమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed