Religious Freedom : భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా సంస్థ నివేదిక.. ఘాటుగా భారత్ రియాక్షన్

by Hajipasha |
Religious Freedom : భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా సంస్థ నివేదిక.. ఘాటుగా భారత్ రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్‌ కమిషన్‌’’(యూఎస్‌‌ సీఐఆర్‌ఎఫ్) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్‌లో మతస్వేచ్ఛపై దాడి జరుగుతోందని ఆ నివేదికలో పేర్కొంది. దీన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్ ఖండించారు. యూఎస్‌‌సీఐఆర్‌ఎఫ్ అనేది రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ అని ఆయన విమర్శించారు. భారత్‌పై ఆ సంస్థ తప్పుడు ప్రచారానికి తెగబడిందని మండిపడ్డారు. అవాస్తవాలు, ప్రేరేపిత కథనాలతో కూడిన నివేదికలను అది వ్యాపింప జేస్తోందన్నారు.

తాజాగా యూఎస్‌‌సీఐఆర్‌ఎఫ్ విడుదల చేసిన నివేదికను భారత్ తిరస్కరిస్తోందని రణధీర్‌ జైస్వాల్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు నివేదికలను రూపొందించడం ద్వారా ఆ సంస్థ విలువ మరింత పతనమైందని ధ్వజమెత్తారు. ఇకనైనా ఇలాంటి అవాస్తవ నివేదికల రూపకల్పనకు దూరంగా ఉండాలని యూఎస్‌‌సీఐఆర్‌ఎఫ్‌కు ఆయన హితవు పలికారు. అమెరికా ఎదుర్కొంటున్న మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టిసారిస్తే బాగుంటుందని రణధీర్‌ జైస్వాల్ సూచించారు.

Next Story

Most Viewed