- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో భారీగా కరోనా కేసులు.. గత 225 రోజుల్లో ఇవే అత్యధికం
న్యూఢిల్లీ : గత 24 గంటల్లో దేశంలో 797 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో కొవిడ్ ఇన్ఫెక్షన్లు బయటపడటం గడిచిన 225 రోజుల్లో ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో గరిష్ఠంగా 865 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల మధ్య కరోనాతో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో 4,091 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 మధ్య కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లలో 145 మందికి కొత్త వేరియంట్ ‘జేఎన్.1’ సోకిందని తేలింది. ‘జేఎన్.1’ అనేది ఒమిక్రాన్సబ్వేరియంట్. దీనికి సంబంధించిన మొదటి కేసు కేరళలో నమోదైంది. కరోనా కేసులు పెరుగుతున్నందున కొవిడ్ పాజిటివ్రోగులకు ఏడు రోజుల హోమ్ఐసోలేషన్ను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
Read More..