భారత్ ఐదో సూపర్ పవర్ : ఏయూ చైర్ పర్సన్

by Vinod kumar |
భారత్ ఐదో సూపర్ పవర్ : ఏయూ చైర్ పర్సన్
X

న్యూఢిల్లీ : భారత్‌ను ప్రపంచంలో ఐదో సూపర్ పవర్‌గా ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) చైర్‌పర్సన్, యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్ అజలీ అసోమానీ కొనియాడారు. చైనా కంటే వేగంగా భారత్ పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు. జీ20 సారథి హోదాలో భారత ప్రధాని మోడీ.. ఆఫ్రికన్ యూనియన్ కు జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వాన్ని ప్రకటించిన క్షణంలో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ‘‘వాస్తవానికి జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరికపై చర్చలు జరగబోతున్నాయని నేను అనుకున్నాను. ఏకంగా మాకు సభ్యత్వం ఇస్తారని అస్సలు ఊహించలేదు. మోడీ ప్రకటన విన్న వెంటనే భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడవబోయాను’’ అని అజలీ అసోమానీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed