Anupriya Patel : భారత్ 836 మందికి ఒక వైద్యుడు: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్

by Ramesh N |
Anupriya Patel : భారత్ 836 మందికి ఒక వైద్యుడు: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో 836 మందికి ఒక వైద్యుడు ఉన్నాడని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌‌సభకు ఆమె వివరాలు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలని, కానీ మన దేశంలో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణం కంటే 1:836తో మెరుగ్గానే ఉందని వెల్లడించారు. జాతీయ మెడికల్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,86,136 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారని పేర్కొన్నారు.

అల్లోపతి వైద్యులు 80 శాతం, దాదాపు 5.65 లక్షల మంది ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉన్నారని వివరించారు. దేశంలో 731మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ప్రస్తుతం 1,12,112 ఎంబీబీఎస్ సీట్లు వార్షికంగా పొందుతున్నారని స్పష్టంచేశారు. మరోవైపు 72,627 పీజీ సీట్లు ఉన్నాయని ఆమె తెలిపారు.

Advertisement

Next Story