భారత్ తమకు '911 కాల్ ' లాంటిది: మాల్దీవుల మాజీ మంత్రి

by S Gopi |   ( Updated:2024-01-09 06:07:07.0  )
భారత్ తమకు 911 కాల్  లాంటిది:  మాల్దీవుల మాజీ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం మాల్దీవుల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపును సూచిస్తుందన్నారు. భారత్ నమ్మకమైన మిత్రదేశమని, రక్షణతో పాటు వివిధ రంగాల్లో సాయం అందిస్తోందని ఆమె తెలిపారు. భారత్‌తో మాల్దీవులకు ఉన్న దీర్ఘకాల బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆమె వింవర్శించారు. మాల్దీవులకు భారత్ '911 కాల్'(అమెరికాలో అత్యవసరానికి ఫోన్ చేసే నంబర్) లాంటిదని, ఏ సమయంలోనైనా సాయం ఆశిస్తే భారత్ చేయి అందిస్తుందని పేర్కొన్నారు. 'తాము అధికారంలో ఉన్న సమయంలో అందరితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాం. భారత్‌తో భద్రతా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేశాం. మాల్దీవుల రక్షణ రంగంలో సామర్థ్యం పెంచుకునేందుకు పరికరాలను అందించడం , మమ్మల్ని మరింత స్వయం సమృద్ధిగా మార్చడానికి భారత్ ప్రయత్నిస్తుందని' మరియా అహ్మద్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed