ఇరాన్ అధ్యక్షుడు మృతి.. భారత సర్కారు కీలక నిర్ణయం

by Shamantha N |
ఇరాన్ అధ్యక్షుడు మృతి.. భారత సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ మృతి నేపథ్యంలో భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అధ్యక్షుడి మృతికి నివాళులర్పిస్తూ మంగళవారం జాతీయ సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది కేంద్ర హోంశాఖ. దేశవ్యాప్తంగా మంగళవారం సంతాప దినం పాటించనున్నట్లు తెలిపింది.

దేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవతనం చేయనున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. మంగళవారం ఎలాంటి వినోద కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రభుత్వ అధికారులకు సూచించింది. మరణించిన ప్రముఖులకు గౌరవ సూచకంగా మే 21న సంతాపదినం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రి సహా పలువురు అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో సోమవారం మరణించారు. పొగమంచు వల్ల హెలికాప్టర్ మిస్ అయిన కొన్ని గంటల తర్వాతే మరణించినట్లు తెలిపింది ఇరాన్ స్టేట్ మీడియా. ఆ తర్వాతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రెసిడెంట్ సెయ్యద్ ఇబ్రహీం రయీసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిత్-అబ్దుల్లాహియాన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

Advertisement

Next Story