Rajnath Singh: సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు- రాజ్ నాథ్ సింగ్

by Shamantha N |
Rajnath Singh:  సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు- రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సరిహద్దులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) అన్నారు. విజయదశమి సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ లోని సుక్నా కాంట్ ని సందర్శించారు. ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ చేసిన అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు. సరిహద్దుల్లో భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. అందుకే ఉద్రిక్తతలు జరగట్లేదన్నారు. కానీ, అజాగ్రత్త పనికిరాదని.. పొరుగుదేశాల నుంచి కవ్వింపు చర్యలు చవచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో దృఢంగా నిలబడాలని అన్నారు. ‘‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమి జరుపుకుంటాము. మనం స్వతహాగా ఏ దేశంపైనా దాడి చేయట్లేదు. ఏ దేశంతోనూ విరోధం లేదు. కానీ ఏ దేశమైనా మన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచినప్పుడు వారితో పోరాడాల్సిందే’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

పీఎల్ఏ తో చర్చలు

కాగా, రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రపంచదేశాల్లో నెలకొంటున్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. భారత సైన్యం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా నిరంతరం సిద్ధంగా ఉండాలన్నారు. లడఖ్ సమస్య పరిష్కారానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) తో శాంతియుత చర్చలు జరపుతున్నామన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ముష్కరులను ఎదుర్కోవడంలో పోలీసు బలగాలు, సైన్యం మధ్య ఉన్న సమన్వయాన్ని కొనియాడారు. కశ్మీర్ లో శాంతిస్థాపనే లక్ష్యమని నొక్కి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed