తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

by Sumithra |
తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..
X

దిశ, వీణవంక : తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని వల్భపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పల్లె స్వామి వృత్తిలో భాగంగా శుక్రవారం ఉదయం తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడ్డాడని తెలిపారు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని గమనించిన తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్లారని తెలిపారు. స్వామి ది నిరుపేద కుటుంబం అయినందున ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

Advertisement

Next Story