ఎమ్మెల్యే నివాసంలో ఆయుధ పూజ

by Naveena |
ఎమ్మెల్యే నివాసంలో ఆయుధ పూజ
X

దిశ, ఉట్నూర్ :విజయదశమి పండుగ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు దంపతులు ఆయుధ పూజ చేశారు. అర్చ‌కుల మంత్రోర్చ‌ణ‌ల న‌డుమ దుర్గామాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి ఒక్కరూ ఆనందోత్సాహాల న‌డుమ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని,ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వ‌ర్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని అమ్మ‌వారిని వేడుకున్నారు. క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో వాహ‌నాల‌కు సైతం పూజ‌లు చేశారు. నియోజవర్గ ప్రజలకు ఆయన ద‌స‌రా శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా..జరుపుకునే విజయదశమి పండగను నిర్వ‌హించుకుంటున్నమని ఎమ్మెల్యే తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి ద‌స‌రా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed