సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

by Naveena |
సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
X

దిశ, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కొత్తగూడెం కాలనీలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో మార్నింగ్ వాక్ లో భాగంగా కొత్తగూడెం కాలనీలో పర్యటించినప్పుడు కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ లేక అవస్థలు పడుతున్నామన్నారు . గత పాలకులు తమ వార్డులో ఎటువంటి అభివృద్ధికి తోడ్పడలేదని తన దృష్టికి రావడంతో కాలనీవాసుల సమస్యలు తీర్చడం కోసం సిసి రోడ్డు పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జి చింతల శ్రీనివాస్ పార్టీ నాయకులు సుశీల్ కుమార్, నాగరాజ్, శేఖర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story