సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాలి- ఎంపీ

by Naveena |
సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాలి- ఎంపీ
X

దిశ, ఉట్నూర్ :ప్రతి ఒక్కరూ సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడుకోవాలనీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని హార్కపూర్ తండా బంజారా నవరాత్రి ఉత్సవాలలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదిలాబాద్ ఎంపి గోడం నగేశ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రాథోడ్ రితీశ్,బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందంను ఘన స్వాగతం పలికారు. నవరాత్రి వేడుకలను స్థానిక జగదంబా దేవి మందిరంలో,శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో సాంప్రదాయ ఘట స్థాపన చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో మంగళహారతులతో శోభయాత్ర నిర్వహించి..మహా బోగ్ బండార్ చేపట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించటానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed