సీఎం రేవంత్ హెలికాప్టర్ ఎంట్రీ మాములుగా లేదుగా..! వీడియో వైరల్

by Ramesh N |
సీఎం రేవంత్ హెలికాప్టర్ ఎంట్రీ మాములుగా లేదుగా..! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రతి దసరా పండుగ రోజు తన సొంత ఊరిలో జరిగే వేడుకలకు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం తన సొంత ఊరికి హెలికాప్టర్‌లో వచ్చారు.

సీఎం ఎంట్రీతోనే పార్టీ శ్రేణులు, అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సొంతురూలో సీఎం హెలికాప్టర్‌లో ఎంట్రీ చూస్తే క్రేజ్ మాములుగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, సీఎం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Advertisement

Next Story