Rajasthan By Poll: పోలింగ్ అధికారి చెంప వాయించిన అభ్యర్థి.. వీడియో వైరల్

by Prasad Jukanti |   ( Updated:2024-11-15 15:37:36.0  )
Rajasthan By Poll: పోలింగ్ అధికారి చెంప వాయించిన అభ్యర్థి.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలింగ్ విధుల్లో ఉన్న అధికారిపై జులుం ప్రదర్శించాడు ఓ అభ్యర్థి. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారి చెంప వాయించాడు. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాజస్థాన్ లో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇవాళ బై పోలింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలో డియోలి-ఉనియారా (Deoli-Uniara) అసెంబ్లీ నియోజకవర్గంలోని సంరవత పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నరేశ్ మీనా హల్ చేశాడు. ఎన్నికల్లో అమిత్ చౌదరి అక్రమానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులు వచ్చి నరేశ్ మీనాను అడ్డుకున్నారు. నరేశ్ మీనా తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత వారమే పార్టీ నుంచి సస్పెండ్:

ఈ ఉప ఎన్నికల్లో నరేశ్ మీనా (Naresh Meena) కాంగ్రెస్ (Congress) టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేశ్ మీనా భారత్ ఆదివాసి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. దీంతో అతడి చర్యపై ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ నరేశ్ మీనాపై గత గురువారం సస్పెండ్ వేటు వేసింది.


👉 Click Here For Tweet!




Advertisement

Next Story