- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ భారత ప్రధాని మోడీయే.. జోస్యం చెప్పింది ఎవరంటే..
దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ ప్రశంసల జల్లు కురిపించారు. నమ్మశక్యం కాని ప్రజాదరణ మోడీ సొంతమని ఆయన కొనియాడారు. భారత్‌కు చెందిన ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌కార్మిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోడీ నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మోడీయే మళ్లీ అధికారంలోకి వస్తారనిపిస్తోంది. చైనా ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్‌ను చాలా ముఖ్యమైన వ్యూహాత్మక మిత్రదేశంగా మేం చూస్తున్నాం’’ అని రిచ్ మెక్‌కార్మిక్ పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోడీకి అనూహ్యమైన ప్రజాదరణ ఉంది. నేను మరికొందరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి మోడీతో భోజనం కూడా చేశాను. భారత్‌లో 70 శాతం జనాదరణ పొందిన వ్యక్తి మోడీయే అనిపిస్తోంది. ఆయనే మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారు’’ అని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ జోస్యం చెప్పారు.