- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ షాక్ !
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ బ్యాంకు ఖాతాలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ చర్యలను కనీసం 10 రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆదాయపు పన్ను ట్రిబ్యునల్ శుక్రవారం తోసిపుచ్చింది. కాంగ్రెస్ తరఫున న్యాయవాది వివేక్ తంఖా వాదనలు వినిపించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయిస్తామని.. అందుకు వీలు కల్పించేలా 10 రోజుల పాటు ఐటీ శాఖ చర్యలపై స్టే విధించాలని ఆయన ట్రిబ్యునల్‌ను అభ్యర్థించారు. ఈ వాదనను ట్రిబ్యునల్ బెంచ్ తిరస్కరించింది. అలాంటి వెసులుబాటు కల్పించే నిబంధనలు లేవని తేల్చి చెప్పింది. 2018-19 సంవత్సరానికి సంబంధించిన రూ.210 కోట్ల ఆదాయపు పన్ను బకాయిలు ఉన్నాయంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్‌కు చెందిన నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. కాంగ్రెస్, ఇండియన్ యూత్ కాంగ్రెస్(ఐవైసీ), ఎన్ఎస్‌యూఐల బ్యాంకు ఖాతాల నుంచి రూ.65 కోట్లకుపైగా నిధులను తమకు బదిలీ చేయాలని ఆయా బ్యాంకులకు ఐటీ శాఖ నిర్దేశించింది. ఈవివరాలను అప్పట్లో కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ మీడియాకు వెల్లడించారు. ఈవిధంగా బ్యాంకు అకౌంట్లను సీజ్ చేస్తే.. పార్టీ ఖర్చులకు సంబంధించిన వివిధ బిల్లులు, జీతాలను చెల్లించలేని పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం పేర్కొంది.