ఉద్యోగుల శిక్షణలో కొత్త క్రిమినల్ చట్టాలు చేర్చండి : డీఓపీటీ

by Hajipasha |
ఉద్యోగుల శిక్షణలో కొత్త క్రిమినల్ చట్టాలు చేర్చండి : డీఓపీటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ విభాగాలకు కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం (డీఓపీటీ) కీలకమైన మెమొరాండంను జారీ చేసింది. జులై 1 నుంచి మూడు నూతన క్రిమినల్ కోడ్ చట్టాలు అమల్లోకి రానున్నందున.. వాటిని ఆయా విభాగాల నూతన ఉద్యోగుల శిక్షణా కోర్సుల్లో భాగంగా చేర్చాలని ఆదేశించింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలపై నూతన ఉద్యోగులకు అన్ని మంత్రిత్వ శాఖలు తప్పకుండా అవగాహన కల్పించాలని కోరింది. ‘ఐగాట్ కర్మయోగి’ అధికారిక పోర్టల్‌లో మూడు క్రిమినల్ కోడ్‌లపై పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, శిక్షణ అవసరాల కోసం దాన్ని వాడుకోవచ్చని సూచించింది. ఈక్రమంలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం సహాయాన్ని కూడా ఇతర మంత్రిత్వ శాఖలు పొందొచ్చని డీఓపీటీ తెలిపింది.

Advertisement

Next Story