- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జమ్మూకాశ్మీర్ ఎన్నికల బరిలోకి.. అఫ్జల్ గురు సోదరుడు!
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో వచ్చే వారమే తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ సెప్టెంబర్ 18, 25 మరియు అక్టోబర్ 1 వ తేదీన మొత్తం మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఈ ఎలక్షన్ కోసం ఇప్పటికే అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఇక్కడ విషయమేమిటంటే.. 2011 లో భారత పార్లమెంటు పై జరిగిన దాడి ఘటనలో.. దోషిగా ఉన్న 'అఫ్జల్ గురు' పెద్ద సోదరుడు 'ఎజాజ్ అహ్మద్ గురు' అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడు. జమ్మూలోని సోపోర్ నియోజక వర్గం నుంచి ఎజాజ్ అహ్మద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగుతుండగా, దీనికి సంబంధించి ఆయన త్వరలోనే నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 12 నామినేషన్ కు తుది గడువు కాగా, మూడవ విడతలో సోపోర్ నియోజక వర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అఫ్జల్ సోదరుడు 'అహ్మద్' పశుసంవర్ధక శాఖ నుండి 2014 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగా.. ప్రస్తుతం కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
జమ్మూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఎజాజ్ అహ్మద్ స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో అందరూ పోటీ చేస్తున్నప్పుడు తానేందుకు నామినేషన్ దాఖలు చేయకూడదని అన్నారు. అయితే తన ఐడియాలజీ తన సోదరుడు అఫ్జల్ కు పూర్తిగా భిన్నమైనదని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.." తొమ్మిది నెలల క్రితం, పూణేలో చదువుకుంటున్న తన కుమారుడిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. ఇలా తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం సరికాదని, ఇలా తప్పుడు కేసులకు బలైతున్న యువకుల కోసం తాను పోరాటం చేస్తాను" అని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జైలులో ఉన్న ఇంజనీర్ రషీద్ కొరకు, నా కుమారుడు అబ్రార్ రషీద్ ప్రచారం చేశారని, దీంతోనే తన కుమారుడిని అరెస్ట్ చేశారని అన్నారు. అయితే తాను ఇప్పుడు, తన సోదరుడు అఫ్జల్ గురు పేరుతో మాత్రం ఎన్నికల్లో ఓట్లు అడగనని స్పష్టం చేశారు సోపోర్ స్వతంత్ర అభ్యర్థి అహ్మద్ గురు.