- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్ పాల్గొన్న సభలో భారత జాతీయ గీతానికి ఘోర అవమానం (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాందీ యూఎల్‌లో పాల్గోన్న సమావేశంలో భారత జాతీయగీతానికి ఘోర అవమానం జరిగింది. 10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో ‘మొహబ్బత్ కీ దుకాన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీపై అనేక ఆరోపణలు చేశారు. అయితే సమావేశం అనంతరం.. భారత జాతీయగీతం ప్లే చేశారు. కానీ సమావేశంలో పాల్గొన్న వారెవ్వరు జాతీయగీతం ప్లే అవుతున్నప్పుడు లేవ లేదు కదా.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు.
అక్కడే ఉన్న మరికొంతమంది భారతీయులు లేచి నిలబడాలని.. మైక్ లో చెప్పినప్పటికీ వారు నీల్చోకుండా. అలానే కూర్చుండి పోయారు. దీంతో రాహుల్ సమక్షంలోనే భారత జాతీయ గీతానికి అవమానం జరిగిందని రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ స్టేజీపై ఉన్నారా లేరా.. అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి రాహుల్ గాంధీ పాల్గోన్న ఈ కార్యక్రమంలో భారత జాతీయ గీతానికి ఇలా అవమానం జరగడం బాధాకరం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.