- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22న వందలాది మగపిల్లలకు రాముడి పేరు.. ఆడపిల్లలకు సీత పేరు
దిశ, నేషనల్ బ్యూరో : జనవరి 22.. యావత్ దేశానికి ఒక ప్రత్యేకమైన రోజు. అయోధ్యా రాముడు నవ్య భవ్య రామమందిరంలో కొలువుతీరిన శుభదినం అది. ఆ రోజున జన్మించిన ఎంతోమంది మగ పిల్లలకు శ్రీరాముడి పేరు, ఆడపిల్లలకు సీతమ్మ పేరు పెట్టుకున్నారు. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా చాలా రాష్ట్రాల్లో రామ్, సీత పేర్లతో పెద్దసంఖ్యలో పిల్లల పేర్లు జననాల నమోదు రిజిస్టర్లలోకి ఎక్కాయని తెలుస్తోంది. మచ్చుకు పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లావ్యాప్తంగా సోమవారం రోజు ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు 80 ప్రసవాలు జరిగాయి. వీరిలో దాదాపు 20 నుంచి 25 మంది పిల్లలకు రామ్, సీత అనే పేర్లు పెట్టుకున్నారు. ఆ ప్రత్యేకమైన రోజున తమ పిల్లలు జన్మించినందుకు పేరెంట్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దామోహ్ జిల్లా ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ) డాక్టర్ విశాల్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘మాది ప్రభుత్వ ఆస్పత్రి. చాలామంది నిత్యం ఇక్కడికి ప్రసవాల కోసం వస్తుంటారు. మా ఆస్పత్రిలో జనవరి 22న 28 మంది పిల్లలు జన్మించారు. వీరిలో ఎంతోమంది పిల్లలకు రామ్, సీత, జానకి, అయోధ్యా ప్రసాద్ అనే పేర్లు పెట్టుకున్నారు’’ అని తెలిపారు.