- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ నియామకాన్ని తప్పుబట్టిన ధర్మాసనం దానిని రద్దు చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులతో కూడిన కమిటీని నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే లోక్‌సభలో విపక్ష మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఈసీలను రాష్ట్రపతి మాత్రమే నియామించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పార్లమెంట్‌లో చట్టం చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని తీర్పు వెల్లడించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వాహణ పారదర్శకంగా ఉండాలని..పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేశ్ రాయ్, సీటీ రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలకూ కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ నిర్వహించి ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
ఈ నేఫథ్యంలో మాజీ అధికారి అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించే ఫైల్‌ను 24 గంటల్లో అన్ని విభాగాల నుంచి వాయువేగంతో అనుమతి పొందడంపై సుప్రీంకోర్టు ఇది వరకే కేంద్రాన్ని ప్రశ్నించింది. గోయెల్ నియామక ఫైల్‌ను సమర్పించడానికి ప్రభుత్వ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్షనేత సభ్యులుగా ఉండే కమిటీ సూచించే వ్యక్తినే రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.