కరోనా కేసులు పెరగుదలకు 3 కారణాలు చెప్పిన IMA

by Mahesh |   ( Updated:2023-04-10 11:05:25.0  )
కరోనా కేసులు పెరగుదలకు 3 కారణాలు చెప్పిన IMA
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు గత వారం రోజులుగా 5 వేలకు పైగా నమోదవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కు మరో పెను ముప్పు పొంచి ఉందని అందరూ భావించారు. దీంతో విశ్లేషణను ప్రారంభించిన ఐఎంఏ.. కరోనా పెరుగుదలకు మూడు కారణాలు ప్రకటించింది. అవి.. "COVID-19 తగిన ప్రవర్తన యొక్క సడలింపు, తక్కువ పరీక్ష రేటు, COVID-19 యొక్క కొత్త వేరియంట్ ఆవిర్భావం వంటి కారణాల వల్ల కరోనా వ్యాధి పెరిగిపోతుందని ఐఎంఏ పేర్కొంది. కాగా ఈ రోజు 5800 లకు పైగా కేసులు నమోదు అవ్వగా.. ఇది దాదాపు నిన్నటితో పోల్చుకుంటే.. 10 శాతం ఎక్కువ.

Advertisement

Next Story