దెయ్యాలు కట్టిన ఈ ఆలయం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఎక్కడ ఉందంటే..?

by Prasanna |
దెయ్యాలు కట్టిన ఈ  ఆలయం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఎక్కడ ఉందంటే..?
X

దిశ, ఫీచర్స్: శివుడిని భోళా శంకరుడు అని పిలుస్తారు. పులి చర్మాన్ని ధరించి స్మశానాలా చుట్టూ తిరుగుతుంటాడు. పురాణాలలో మనం ముఖ్యంగా మాంత్రికులు, రాక్షసులు భోళా శంకరుని నుండి ప్రయోజనం పొంది ఆ తర్వాత వారిని నాశనం చేశారని మనం పురాణాల్లో చదువుతాము.

ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో దతియాన్నా అనే గ్రామం ఉంది. ఇక్కడ భూతన్ వాల్ దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలు ఒక్క రాత్రిలో దీన్ని నిర్మించాయని చెబుతుంటారు. కొన్నేళ్ల క్రితం ఈ స్థలంలో ఖాళీగా ఉండేది. కానీ ఒక రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఎర్రటి ఇటుకలతో దేవాలయం నిర్మించి ఉంది. ఆ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. అక్కడ ఎక్కువగా దెయ్యాలు సంచరిస్తుంటాయి కాబట్టి ఆ ఊరి గ్రామస్థులు రాత్రిపూట అక్కడికి వెళ్లే వారు కాదు. ఈ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు.

ఈ ఆలయాన్ని దెయ్యాలే కట్టాయని గ్రామస్తులు అనుకున్నారు. కానీ , ఆ గుడిని ఎవరు డెవలప్ చేయలేదు. ఎర్ర ఇటుకలతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. కానీ.. రాజా నైన్ సింగ్ ఆ తర్వాత ఆలయాన్ని అభివృద్ధి చేశాడని చెబుతున్నారు. అయితే అది సాతాను నిర్మించిన ఆలయమని నేటికీ అక్కడి ప్రజలు చెబుతుంటారు. సాయంత్రం పూట ఈ ఆలయానికి ఎవరూ వెళ్లరు. శ్రావణ మాసంలో శివరాత్రి సమయంలో, ఆలయంలో పూజలు, అభిషేకాలు , ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటికి ఈ ఆలయ చరిత్ర ఒక మిస్టరీగా ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed