- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు చేతకాకపోతే మేం చేస్తాం.. కేంద్రానికి ‘సుప్రీం’ అల్టిమేటం
దిశ, నేషనల్ బ్యూరో : మహిళా కోస్ట్‌గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ (శాశ్వత నియామకం) మంజూరు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చింది. మహిళలకు నేవీ, ఆర్మీలలో పర్మినెంట్ కమిషన్ ఇస్తున్నప్పుడు.. కోస్ట్ గార్డ్ విభాగంలో మాత్రం ఎందుకు ఇవ్వలేరని కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘‘మేం మహిళలను వదిలిపెట్టలేం.. ఒకవేళ ఈవిషయంలో మీరు చొరవ చూపకుంటే.. మేం తగిన నిర్ణయం తీసుకుంటాం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించాలని కేంద్ర సర్కారు తరఫు న్యాయవాది అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి సీజేఐ సూచించారు. దీనిపై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా కోస్ట్‌గార్డ్ విభాగానికి సూచిస్తామని ఆర్ వెంకటరమణి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణకు మార్చి 1వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద కోస్ట్‌గార్డ్ విభాగంలో చేరిన మహిళల్లో అర్హులైన వారికి పర్మినెంట్ కమిషన్ (శాశ్వత నియామకం) మంజూరు చేయాలని కోరుతూ మహిళా కోస్ట్ గార్డ్ అధికారిణి ప్రియాంకా త్యాగి దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఆర్మీ, నేవీలలో మహిళలకు శాశ్వత కమిషన్ కేటాయింపుపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ.. కోస్ట్ గార్డ్ విభాగంలోనూ స్త్రీలకు ఆ అవకాశాన్ని కల్పించాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.