- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై సిగ్నల్ జంప్ చేస్తే.. వారికి ఫైన్ ఉండదు!
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులకు సంబంధించి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై సిగ్నల్ జంప్ చేసి వెళ్లే వారికి ఫైన్లు విధించకుండా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అయితే ఇది అన్ని సమయాల్లో వర్తించదు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు దారి ఇచ్చే సమయంలో మాత్రమే సిగ్నల్ జంప్ చేసేవారికి ఈ ట్రాఫిక్ ఫైన్స్ ఉండవని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను కర్ణాటక రాజధాని బెంగళూరు పోలీసులు తాజాగా తీసుకొచ్చారు.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అంబులెన్స్‌కు దారి ఇస్తున్న క్రమంలో సిగ్నల్ జంప్ అయితే.. ఒక వేలా సిగ్నల్ కెమెరాల ద్వారా వాహనాదారులకు జరిమానాలు వస్తే.. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ లేదా కర్ణాటక స్టేట్ పోలీస్ యాప్ ద్వారా సంప్రదించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ అనుచేత్ వెల్లడించారు. మరోవైపు అంబులెన్స్‌కు దారివ్వడానికి సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. ఈ నిబంధనపై బెంగళూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.